నారి నారి నడుమ మురారి!
on Dec 26, 2022
ఓటిటి వేదిక ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ షోకి మంచి స్పందన లభిస్తోంది. మొదటి సీజన్ నుండి భారీ వ్యూయర్ షిప్ తో ఓటిటి లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకొని, అన్ స్టాపబుల్ గా సీజన్-2 లోకి అడుగుపెట్టింది.
ఈ సీజన్-2 లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఎపిసోడ్-6 లో జయప్రద, జయసుధ ఇద్దరు గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ వారిద్దరి మధ్యలో నిల్చొని 'నారి నారి నడుమ మురారి' అని అనడంతో షోలో నవ్వులు పూసాయి. "మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు?" అని బాలకృష్ణ అడిగాడు. "మొదట్లో షూటింగ్ లో కలిసాం. నేను తరచూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని.. వాళ్ళింట్లో తనని 'సుజాత' అని పిలిచేవాళ్ళు. తర్వాత నుండి నేను కూడా తనని సుజాత అనే పిలిచేదాన్ని" అని జయప్రద చెప్పింది. "అంతకు ముందు బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత అడవి రాముడు సినిమాతో మేం బాగా క్లోజ్ అయ్యాం. మేమిద్దరం దాదాపు నలభై రోజులు ఒక ఫారెస్ట్ లో ఉన్నాం" అని జయసుధ చెప్పింది.
"ఇద్దరు కలిసి సినిమాల్లో నటించేవాళ్ళు. ఆ సినిమాల్లో ఎవరో ఒకరు హీరోని దక్కించుకునేవాళ్ళు..అలా నిజ జీవితంలో కూడా జరిగిందా?" అని బాలకృష్ణ అడిగేసరికి ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ వారిద్దరిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ స్నేహాన్ని పరీక్షించే ఒక గేమ్ ని ఆడించాడు. అందులో బాలకృష్ణ చిలిపి సమాధానాలు చెప్తూ.. షోలో నవ్వులు పూయించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
